Priyanka Gandhi: ఢిల్లీ ప్రజలు మార్పుకు ఓటు వేశారు: ప్రియాంకాగాంధీ

- ప్రస్తుత పరిస్థితులపై ఢిల్లీ ప్రజలు విసిగిపోయారన్న ప్రియాంక
- మనందరం మరింత కష్టపడి పనిచేయాలని పార్టీ శ్రేణులకు సూచన
- గెలుపొందిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపిన వయనాడ్ ఎంపీ
27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన ప్రత్యర్థి ఆప్ ను చిత్తు చేసింది. కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా గెలవలేకపోయింది. వరుసగా మూడోసారి సున్నా స్థానాలకు పరిమితమయింది.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకాగాంధీ మాట్లాడుతూ... ఢిల్లీ ప్రజలు 'మార్పు'కు ఓటు వేశారని చెప్పారు. రాజధాని ప్రజలు మార్పును కోరుకున్నారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులలో ఢిల్లీ ప్రజలు విసిగిపోయారని, ప్రస్తుత పరిస్థితిని మార్చాలని అనుకున్నారని చెప్పారు. ఎన్నికల్లో గెలుపొందిన అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు. ఇక మనం చేయాల్సిందల్లా... మరింత కష్టపడి పనిచేయడమేనని... క్షేత్ర స్థాయిలో ఉంటూ ప్రజల సమస్యలపై బాధ్యతగా పోరాడాలని చెప్పారు.
కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానం నుంచి ప్రియాంకాగాంధీ గెలుపొందిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె మూడు రోజుల పర్యటనకు గాను వయనాడ్ కు వెళ్లారు.