Monalisa: కుంభమేళా బ్యూటీ మోనాలిసా ఫస్ట్ మూవీకి ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా...?

- మహా కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మోనాలిసా భోస్లే
- రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిపోయిన పూసలమ్ముకునే అమ్మాయి
- ఆ తర్వాత ఏకంగా బాలీవుడ్ చిత్రంలో అవకాశం
- దర్శకుడు సనోజ్ మిశ్రా తెరకెక్కిస్తున్న ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ మూవీలో ఛాన్స్
- తొలి మూవీకి ఆమెకు రూ.21 లక్షలు రెమ్యునరేషన్‌గా అందినట్లు సమాచారం
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో మోనాలిసా భోస్లే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విషయం తెలిసిందే. పూసలమ్ముకునే ఈ 16 ఏళ్ల తేనె కళ్ల సుందరి రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిపోయింది. డస్కీ బ్రౌన్ కలర్ లో కాంతులీనుతున్న ఆమె అందానికి ఫిదా అయిన వారు ఫొటోలు, వీడియోల కోసం ఎగబడ్డారు. దాంతో ఆమె తాలూకు వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆమె పేరు మార్మోగిపోతోంది.
ఈ క్రమంలో ఆమెకు బాలీవుడ్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. దర్శకుడు సనోజ్ మిశ్రా తన చిత్రంలో ఆమెకు అవకాశం ఇచ్చారు. ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ పేరుతో తెరకెక్కనున్న తన మూవీ కోసం మోనాలిసా సంతకం కూడా చేశారు. ఇప్పుడు ఆమె ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్‌పై నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఈ చిత్రానికి గాను మోనాలిసాకు రూ.21 లక్షలు రెమ్యునరేషన్‌గా అందినట్లు తెలుస్తోంది. అలాగే ఆమె స్థానికంగా బిజినెస్ ప్రమోషన్స్ కోసం రూ. 15 లక్షలతో ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. పూసలు అమ్మి రోజుకు రూ.1000 సంపాదించే ఈ బ్యూటీ ఇప్పుడు ఏకంగా లక్షల్లో ఆర్జిస్తుండటం విశేషం. దీంతో అదృష్టం అంటే ఆమెదేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.