Kishan Reddy: తెలంగాణలో అనుకూల వాతావరణం ఉంది... గెలుపుగా మలుచుకోవాలి: కిషన్ రెడ్డి

Kishan Reddy on Delhi results

  • ఢిల్లీలో ఘన విజయం సాధించబోతున్నామన్న కిషన్ రెడ్డి
  • ఇదే ఊపుతో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని పిలుపు
  • బీజేపీ అంటే దేశ వ్యాప్తంగా ఒక నమ్మకమని వ్యాఖ్య

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సత్తా చాటుతోంది. 48 స్థానాల్లో ఆధిక్యతతో ఘన విజయం దిశగా దూసుకెళుతోంది. పలువురు ఆప్ కీలక నేతలు ఓటమి బాటలో ఉన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ... ఢిల్లీలో ఘన విజయం సాధించబోతున్నామని చెప్పారు. ఇదే ఊపుతో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గెలవాలని పార్టీ క్యాడర్ కు పిలుపునిచ్చారు. 

బీజేపీ అంటే దేశ వ్యాప్తంగా ఒక నమ్మకమని కిషన్ రెడ్డి చెప్పారు. నిజాయతీతో కూడిన పాలన బీజేపీతోనే సాధ్యమని అన్నారు. దేశ రాజధానిలో బీజేపీ జెండా ఎగురవేస్తున్నామని... తెలంగాణలో కూడా సానుకూల వాతావరణం ఉందని... దాన్ని గెలుపుగా మలుచుకోవాలని చెప్పారు. 

మరోవైపు, ఢిల్లీ ఎన్నికల ఫలితాలు అనుకూలంగా వస్తుండటంతో ఆ పార్టీ శ్రేణులు జోష్ లో మునిగిపోయాయి. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద సందడి నెలకొంది. 

  • Loading...

More Telugu News