Kejriwal: ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో సంచలనం.. కేజ్రీవాల్ ఓటమి

Arvind Kejriwal Loses New Delhi Seat As AAP Heads For Rout

  • న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఓడిన ఆప్ చీఫ్
  • మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పరాజయం
  • కోండ్లీలో ఆప్‌ అభ్యర్థి కుల్‌దీప్‌ కుమార్‌ గెలుపు

ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో సంచలనం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కేజ్రీవాల్ ను బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ ఓడించారు. 3 వేల పైచిలుకు ఓట్లతో పర్వేశ్ గెలుపొందారు. మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ కీలక నేత మనీశ్ సిసోడియా కూడా ఓటమి పాలయ్యారు. జంగ్ పురా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సిసోడియా 600 ఓట్లకు పైగా తేడాతో ఓడిపోయారు. జైలుకు వెళ్లివచ్చిన సానుభూతి సిసోడియాను ఈ ఎన్నికల్లో గట్టెక్కించలేకపోయింది.

బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ ఇక్కడ గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తొలి విజయం ఆప్ ఖాతాలోనే పడింది. కోండ్లి నియోజకవర్గంలో తొలి ఫలితం వెలువడింది. ఈ నియోజకవర్గంలో ఆప్ తరఫున పోటీ చేసిన కుల్ దీప్ కుమార్ గెలుపొందారు. బీజీపీ అభ్యర్థి ప్రియాంక గౌతమ్‌పై కుల్ దీప్ 6,293 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. కాగా, లక్ష్మీనగర్‌ నియోజకవర్గంలో అభయ్‌ వర్మ విజయం సాధించడంతో బీజేపీ ఖాతా తెరిచింది.

  • Loading...

More Telugu News