Retro: సూర్య 'రెట్రో' తెలుగు టీజర్ రిలీజ్.. విడుదల తేదీ కూడా కన్ఫర్మ్!

- సూర్య, కార్తీక్ సుబ్బరాజు కాంబినేషన్ లో రెట్రో
- మే 1న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన మేకర్స్
- యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కిన మూవీ
తమిళ నటుడు సూర్య, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం రెట్రో. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్... తెలుగు టీజర్‌ను కూడా విడుదల చేశారు. వేసవి కానుకగా మే 1న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కినట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. మరోసారి సూర్య తన నటనతో ఆకట్టుకున్నారు. అలాగే హీరోయిన్ గా పూజా హెగ్డే.. ఇతర కీలక పాత్రల్లో మలయాళ నటుడు జోజు జార్జ్, జయరామ్, కరుణకరణ్ నటించారు.
నాని నటించిన 'దసరా' చిత్రానికి బాణీలు అందించిన సంతోశ్ నారాయణ్ ఈ మూవీకి కూడా సంగీతం అందిస్తున్నారు. సూర్య తన సొంత నిర్మాణ సంస్థ 2డీ బ్యానర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రెట్రో చిత్రాన్ని భారీగా నిర్మించారు.