Naga Chaitanya: సమంతతో విడాకుల గురించి నాగచైతన్య కీలక వ్యాఖ్యలు

Naga Chaitanya comments on divorce with Samantha

  • విడాకుల నిర్ణయం రాత్రికి రాత్రి తీసుకున్నది కాదన్న చైతూ
  • ఎన్నో రోజులు చర్చించుకున్న తర్వాత విడిపోవాలని నిర్ణయించుకున్నామని వెల్లడి
  • తనపై నెగెటివ్ కామెంట్స్ ఆపేయాలన్న నాగచైతన్య

తన మాజీ భార్య సమంతతో విడిపోవడం గురించి సినీ నటుడు నాగచైతన్య కీలక విషయాన్ని వెల్లడించారు. విడాకులు తీసుకోవాలనేది రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం కాదని ఆయన చెప్పారు. ఎన్నో రోజులు చర్చించుకున్న తర్వాతే ఇద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. చాలా రోజులు చర్చించుకున్న తర్వాతే ఇద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. 

తమ విడాకుల అంశం ఇతరులకు వినోదంగా మారిందని చైతూ అసహనం వ్యక్తం చేశారు. తమ విడాకుల అంశంపై ఎన్నో గాసిప్స్ రాశారని అన్నారు. తన మీద నెగెటివ్ కామెంట్లు చేసేవారు ఇకనైనా వాటిని ఆపేయాలని కోరారు. మీ భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలని హితవు పలికారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు స్పందించారు.

సినీ పరిశ్రమలో పీఆర్ యాక్టివిటీ గురించి ఆయన మాట్లాడుతూ... ఈ రోజుల్లో తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ పీఆర్ లను నియమించుకుంటున్నారని చెప్పారు. తాను పీఆర్ గేమ్ లోకి ఆలస్యంగా వచ్చానని తెలిపారు. సినిమా షూటింగ్ అయిపోయిందా... ఇంటికి వెళ్లామా... మన జీవితం మనం చూసుకున్నామా అన్నట్టుగా తన జీవితం ఉండేదని చెప్పారు. తనకు రాజకీయాలు తెలియవని అన్నారు. నువ్వు ఉన్న రంగంలో రాణించాలంటే కొన్ని పనులు చేయక తప్పదని చెప్పారు. 

గత రెండేళ్ల నుంచి పీఆర్ యాక్టివిటీ ఎక్కువయిందని చైతూ తెలిపారు. ప్రతి నెల కనీసం రూ. 3 లక్షలు పెట్టకపోతే ఈ రంగంలో సరైన దారిలో వెళుతున్నట్టు కాదని అన్నారు. సినిమా గురించి ప్రేక్షకులు మాట్లాడుకునేలా చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. కానీ, కొందరు అనవసర, అసత్య ప్రచారాలు చేస్తుంటారని... పక్కనోడిని తొక్కేయాలని చూస్తుంటారని విమర్శించారు. అలా చేయడం తప్పని అన్నారు. పక్కన ఉన్నోళ్లను ఇబ్బంది పెట్టే బదులు... ఆ సమయాన్ని మన ఎదుగుదల కోసం ఉపయోగించుకోవడం మంచిదని అన్నారు.

  • Loading...

More Telugu News