Pakistan: ఛాంపియ‌న్స్ ట్రోఫీకి పాకిస్థాన్ కొత్త జెర్సీ.. ఇదిగో వీడియో!

Pakistan New Jersey for Champions Trophy 2025

  • ఈ నెల 19 నుంచి పాక్‌, దుబాయ్ వేదిక‌ల‌లో ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ ప్రారంభం
  • ఈ ట్రోఫీ కోసం త‌మ జ‌ట్టు ఆటగాళ్ల కోసం కొత్త జెర్సీని తీసుకొచ్చిన పీసీబీ
  • నిన్న గ‌డాఫీ స్టేడియంలో గ్రాండ్‌గా కొత్త‌ జెర్సీ లాంచ్ ఈవెంట్‌  

ఈ నెల 19 నుంచి పాకిస్థాన్‌, దుబాయ్ వేదిక‌ల‌లో ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. ఇక ఈ టోర్నీ నిర్వ‌హ‌ణ‌కు దాయాది దేశం అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇందులో భాగంగా  ఇటీవల గడాఫీ స్టేడియాన్ని సిద్ధం చేసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అదే స్టేడియంలో శుక్ర‌వారం నాడు తమ జ‌ట్టు కొత్త‌ జెర్సీ లాంచ్ ఈవెంట్‌ను కూడా నిర్వహించింది. 

స్టేడియంలో గ్రాండ్ గా ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా పాక్‌ కొత్త కెప్టెన్ మ‌హ‌మ్మ‌ద్‌ రిజ్వాన్‌తో పాటు ఇత‌ర‌ క్రికెటర్లందరూ కొత్త జెర్సీ ధరించి స్టేడియంలో రచ్చ చేశారు. పాక్ క్రికెట‌ర్లు మొద‌ట‌ జెర్సీ పైన స్వెట్టర్లు వేసుకొని స్టేడియంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఆ స్వెట్టర్లను విప్పేసి, జెర్సీని రివిల్ చేశారు. 

ఇక ఈ ఈవెంట్‌కు భారీగా త‌ర‌లివ‌చ్చిన‌ ఆ జట్టు అభిమానులు కొత్త జెర్సీలో త‌మ అభిమాన ప్లేయ‌ర్ల‌ను చూసి కేరింతలు, చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేశారు. ఈ ఈవెంట్ తాలూకు వీడియోను పీసీబీ త‌న అధికారిక 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) ఖాతాలో షేర్ చేసింది. 

More Telugu News