Erode (East) Assembly By-Election: ఈరోడ్ ఉప ఎన్నిక.. ముందంజలో డీఎంకే!

- పునర్విభజనలో భాగంగా 2002లో ఏర్పడిన ఈరోడ్ స్థానం
- ఇప్పటి వరకు ఏడుసార్లు ఎన్నికలు
- మూడుసార్లు అన్నాడీఎంకే, నాలుగుసార్లు డీఎంకే విజయం
తమిళనాడులోని ఈరోడ్ (తూర్పు) అసెంబ్లీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలుత పోస్టల్ ఓట్లు లెక్కిస్తున్నారు. అనంతరం ఈవీఎంలు లెక్కించనున్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం పోస్టల్ ఓట్లలో డీఎంకేకు చెందిన వీసీ చందరాకుమార్ ముందంజలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 51 మంది సిబ్బంది లెక్కింపులో పాలు పంచుకుంటున్నారు.
నియోజకవర్గాల డీలిమిటేషన్ (పునర్విభజన) తర్వాత 2002లో ఈరోడ్ (ఈస్ట్) అసెంబ్లీ స్థానం ఏర్పడింది. అప్పటి నుంచి ఏడు ఎన్నికలు జరిగాయి. ఇందులో మూడు లోక్‌సభ ఎన్నికలు ఉన్నాయి. 2023 ఫిబ్రవరిలో ఒకసారి ఉప ఎన్నిక జరిగింది. ఈరోడ్ పార్లమెంటరీ స్థానంలోని అసెంబ్లీ సెగ్మెంట్‌కు 2014, 2019, 2024లో ఎన్నికలు జరిగాయి. మూడుసార్లు అన్నాడీఎంకే, నాలుగుసార్లు డీఎంకే విజయం సాధించాయి. ఈసారి కూడా డీఎంకే గెలుపు ఖాయంగా కనిపిస్తోంది.