Mini Kejriwal: ఢిల్లీ ఎన్నికల ఫలితాల వేళ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ‘మినీ కేజ్రీవాల్’.. వీడియో ఇదిగో!

- కేజ్రీవాల్ ఇంట్లో సందడి చేసిన అవ్యాన్ తోమర్
- అచ్చం కేజ్రీవాల్‌ను తలపిస్తూ రాజకీయ నాయకుడిని తలపించిన చిన్నారి
- ‘బేబీ మఫ్లర్ మ్యాన్’గా ‘ఆప్’ నామకరణం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు వేళ ‘మినీ కేజ్రీవాల్’ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌కు మద్దతుదారుడైన అవ్యాన్ తోమర్ నిన్న ఉదయం కేజ్రీవాల్ గెటప్‌లో ఆయన ఇంటికి వెళ్లాడు. అచ్చం రాజకీయ నాయకుడిలా కనిపించిన అవ్యాన్‌ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
అవ్యాన్ అచ్చం కేజ్రీవాల్‌లానే నీలం రంగు స్వెట్టర్, వైట్ కాలర్, గ్రీన్ పఫ్ జాకెట్ ధరించాడు. మెడకు నల్లని మఫ్లర్ కట్టుకున్నాడు. కళ్లకు అద్దాలు పెట్టుకోవడంతోపాటు మీసాలు కూడా దిద్దుకున్నాడు. ఎన్నికల ఫలితాల వేళ తాము ప్రతిసారి ఇక్కడకు వస్తామని అవ్యాన్ తండ్రి రాహుల్ తోమర్ చెప్పారు. అవ్యాన్‌కు ఆప్ ‘బేబీ మఫ్లర్ మ్యాన్’గా నామకరణం చేసింది.
అవ్యాన్ 2022 ఢిల్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇలాగే అందరినీ ఆకర్షించాడు. ఆ ఎన్నికల్లో ఆప్ గెలిచిన తర్వాత తోటి చిన్నారులతో కలిసి అవ్యాన్ సంబరాలు చేసుకున్నాడు. నాలుగేళ్ల అవ్యాన్ విక్టరీ సింబల్ చూపిస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.