Kolikapudi Srinivas: మరో వివాదంలో తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి

- ఇటీవల కాలంలో తరచూ వివాదాల్లో కొలికపూడి
- కొన్ని రోజుల కిందటే టీడీపీ హైకమాండ్ సీరియస్ వార్నింగ్
- తాజాగా పురుగులమందు తాగిన టీడీపీ కార్యకర్త డేవిడ్
- కొలికపూడి వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ సెల్ఫీ వీడియో
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే కొలికపూడి వేధింపులు తట్టుకోలేకపోతున్నాంటూ ఓ టీడీపీ కార్యకర్త పురుగులమందు తాగాడు.
ఆ కార్యకర్త పేరు డేవిడ్. ఎమ్మెల్యే కొలికపూడి తనను అక్రమ కేసులతో వేధిస్తున్నాడంటూ డేవిడ్ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. సెల్ఫీ వీడియో బయటికి రాకుండా కొలికపూడి బెదిరించారని ఆరోపించాడు. కాగా, నిన్న పురుగులమందు తాగిన డేవిడ్... ప్రస్తుతం విజయవాడలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో, డేవిడ్ సెల్ఫీ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇటీవలే ఓ వివాదంపై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు టీడీపీ హైకమాండ్ సీరియస్ వార్నింగ్ ఇవ్వడం తెలిసిందే.