Stock Market: మెప్పించని ఆర్బీఐ నిర్ణయాలు... స్టాక్ మార్కెట్లకు నష్టాలు

- బ్యాంకుల్లో లిక్విడిటీ పెంచేందుకు చర్యలు తీసుకోని ఆర్బీఐ
- 197 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 43 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిశాయి. ఆర్బీఐ మానిటరీ పాలసీ నిర్ణయాలు ఇన్వెస్టర్లను మెప్పించలేకపోయాయి. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించినప్పటికీ... బ్యాంకుల్లో లిక్విడిటీ పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీసింది.
ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 197 పాయింట్లు నష్టపోయి 77,860కి పడిపోయింది. నిఫ్టీ 43 పాయింట్లు కోల్పోయి 23,559 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (4.34%), భారతి ఎయిర్ టెల్ (3.60%), జొమాటో (2.10%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.86%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.45%).
టాప్ లూజర్స్:
ఐటీసీ (-2.38%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.03%), అదానీ పోర్ట్స్ (-1.44%), టీసీఎస్ (-1.31%), ఐసీఐసీఐ (-1.19%).