Taman: నన్ను సలహా అడిగితే... పెళ్లి చేసుకోవద్దనే చెబుతా: తమన్

- అమ్మాయిలు ఇండిపెండెంట్ అయ్యారన్న తమన్
- ఇతరుల మీద ఆధారపడి జీవించాలనుకోవడం లేదని వ్యాఖ్య
- కలిసి ఉండాలనే ఆలోచనా ధోరణి యువతలో మారిపోయిందన్న తమన్
టాలీవుడ్ లో సంగీత దర్శకుడు తమన్ దూసుకుపోతున్నారు. స్టార్ హీరోలందరి సినిమాలకు సంగీతాన్ని అందిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో లైఫ్ స్టైల్, స్ట్రెస్ గురించి మాట్లాడుతూ... ఈ తరం యువత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పెళ్లిళ్ల గురించి తమన్ మాట్లాడుతూ... ఇప్పుడు అమ్మాయిలు ఇండిపెండెంట్ అయ్యారని చెప్పారు. అబ్బాయిలతో సమానంగా చదువుకుని, ఉద్యోగాలు చేసుకుంటున్నారని... మరొకరి మీద ఆధారపడి జీవించాలనుకోలేదని అన్నారు. సోషల్ మీడియా ప్రభావం, ఇన్స్టా వాడకం ఎక్కువయిందని చెప్పారు. జనాల మైండ్ సెట్ మారిపోయిందని... కలిసి ఉండాలనే ఆలోచనా ధోరణి కూడా మారిపోయిందని అన్నారు. పెళ్లి చేసుకున్నా కొన్నాళ్లకే విడిపోతున్నారని చెప్పారు. అందుకే పెళ్లి చేసుకోవడం వేస్ట్ అని తాను చెబుతున్నానని అన్నారు. పెళ్లి గురించి ఎవరైనా తనను సలహా అడిగితే... పెళ్లి వద్దనే చెపుతానని తెలిపారు.