Akkineni Family: ప్రధాని మోదీని కలిసిన అక్కినేని కుటుంబం

- ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన అక్కినేని ఫ్యామిలీ
- పార్లమెంట్‌కు వెళ్లిన నాగార్జున దంపతులు, చైతూ, శోభిత
- పార్లమెంట్‌లో దిగిన ఫొటోలు బయటకు రావడంతో నెట్టింట వైరల్
అక్కినేని కుటుంబం ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది. ప్రధానిని కలవడానికి నాగార్జున, అమల, కొత్త జంట నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల పార్లమెంట్‌కు వెళ్లారు. ఈ భేటీలో వారు అక్కినేని బయోగ్రఫీపై వస్తున్న పుస్తకం గురించి చర్చించినట్లు సమాచారం.
అటు, అక్కినేని కుటుంబం పార్లమెంట్ కు కూడా వెళ్లింది. వారు పార్లమెంటులో దిగిన ఫొటోలు బయటకు రావడంతో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా అవుతున్నాయి. ఇక ప్రధాని మోదీ తన మన్‌కీ బాత్ కార్యక్రమంలో ఇటీవల దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు గురించి మాట్లాడిన విషయం తెలిసిందే.
భారతీయ సినిమాకు ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా ప్రధాని కొనియాడారు. దాంతో అక్కినేని ఫ్యామిలీ సోషల్ మీడియా వేదికగా మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే.