West Bengal: సెల‌వు ఇవ్వ‌లేద‌ని ప్ర‌భుత్వ ఉద్యోగి ఘాతుకం... ఏం చేశాడో తెలిస్తే..!

Denied Leave West Bengal Man Stabs 4 Colleagues Then Walks Around With Knife

  • ఆఫీస్‌లో సెల‌వు ఇవ్వ‌లేద‌ని న‌లుగురు స‌హాద్యోగుల‌ను పొడిచిన వైనం
  • ప‌శ్చిమ బెంగాల్ రాజ‌ధాని కోల్‌క‌తాలో ఘ‌ట‌న‌
  • దాడి చేసి అదే క‌త్తి, ర‌క్తం మ‌ర‌క‌ల‌తో రోడ్డుపై న‌డుచుకుంటూ వెళ్లిన ఉద్యోగి

ఆఫీస్‌లో సెల‌వు ఇవ్వ‌లేద‌ని ఓ ఉద్యోగి న‌లుగురు స‌హోద్యోగుల‌ను పొడిచిన ఘ‌ట‌న‌ ప‌శ్చిమ బెంగాల్ రాజ‌ధాని కోల్‌క‌తాలో జ‌రిగింది. అమిత్ కుమార్ స‌ర్కార్‌ కోల్‌కతాలోని న్యూటౌన్ ప్రాంతంలోని కరిగరి భవన్‌లో సాంకేతిక విద్యా విభాగంలో ప్ర‌భుత్వ ఉద్యోగిగా ప‌నిచేస్తున్నాడు. నిన్న అత‌డు సెల‌వు కోసం ద‌ర‌ఖాస్తు చేయ‌గా రిజెక్ట్ అయింది. 

ఈ విష‌యంపైనే తోటి ఉద్యోగుల‌తో అత‌డు వాగ్వాదానికి దిగాడు. ఈ క్ర‌మంలో అత‌డు త‌న‌తో పాటు తెచ్చుకున్న క‌త్తితో న‌లుగురిపై దాడికి పాల్ప‌డ్డాడు. అనంత‌రం క‌త్తి, ర‌క్తం మ‌ర‌క‌ల‌తో రోడ్డుపై న‌డుచుకుంటూ వెళ్లాడు. ఆ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. 

"నార్త్ 24 పరగణాల జిల్లా సోదేపూర్‌లోని ఘోలా వాసి సర్కార్ సాంకేతిక విద్యా విభాగంలో పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం సెలవు విష‌య‌మై తన సహోద్యోగులతో జరిగిన గొడవ నేప‌థ్యంలో అతను వారిపై కత్తితో దాడి చేసి, పారిపోవడానికి ప్రయత్నించాడు" అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

గాయపడిన సహోద్యోగులు జయదేబ్ చక్రవర్తి, సంతను సాహా, సర్తా లతే, షేక్ సతాబుల్‌లను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

సర్కార్‌ను అరెస్టు చేశామని, తదుపరి దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు. అతనికి మానసిక ఆరోగ్య సమస్యలు ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

  • Loading...

More Telugu News