Sonu Sood: అరెస్ట్ వారెంట్ పై సోనూ సూద్ క్లారిటీ

Sonu Sood give a Clarity on Arrest Warrant

  • ఓ కేసులో సోనూ సూద్‌పై అరెస్ట్ వారెంట్ జారీ అంటూ వార్త‌లు
  • ఆ వార్త‌లు పూర్తిగా అబద్ధ‌మ‌న్న న‌టుడు
  • త‌న‌కు సంబంధం లేని వేరే అంశంలో సాక్ష్యం కోసం కోర్టు త‌న‌ను పిలిచిన‌ట్లు క్లారిటీ
  • ఆ కేసుతో త‌న‌కు ఏ విధంగానూ సంబంధం లేద‌ని వెల్ల‌డి
  • కేవ‌లం ప‌బ్లిసిటీ కోసం త‌న‌ పేరును వాడుతున్నార‌ని ఆవేద‌న‌

త‌న‌పై అరెస్ట్ వారెంట్ జారీ అయిందంటూ వ‌చ్చిన వార్త‌ల‌పై న‌టుడు సోనూ సూద్ ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా క్లారిటీ ఇచ్చారు. ఆ వార్త‌లు పూర్తిగా అబద్ధ‌మ‌ని ఆయ‌న చెప్పారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఈ అంశాన్ని కావాల‌ని సెన్సేష‌న‌లైజ్ చేస్తున్నార‌ని సోనూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌న‌కు సంబంధం లేని వేరే అంశంలో సాక్ష్యం చెప్పేందుకు కోర్టు త‌న‌ను పిలిచిన‌ట్లు ఆయ‌న క్లారిటీ ఇచ్చారు.

"నాకు ఎటువంటి సంబంధం లేని మూడవ పక్షానికి సంబంధించిన కేసులో న్యాయస్థానం న‌న్ను సాక్షిగా సమన్లు జారీ చేసింది. అందుకు మా న్యాయవాదులు స్పందించారు. ఈ కేసులో దేనికీ నేను బ్రాండ్ అంబాసిడ‌ర్‌ను కాదు. మాకు ఏ విధంగానూ సంబంధం లేదు. సెలబ్రిటీలు ఇలా అన‌వ‌స‌ర విష‌యాల‌కు లక్ష్యాలుగా మారడం విచారకరం. ప‌బ్లిసిటీ కోసం నా పేరును వాడుతున్నారు. ఆ విష‌యంలో క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటాం" అని సోనూ సూద్ ట్వీట్ చేశారు. 

కాగా, మోసం కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు హాజరుకాక పోవడంతో సోనూ సూద్‌పై పంజాబ్‌లోని లుథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసిందంటూ వార్త‌లు వెలువ‌డిన విష‌యం తెలిసిందే. 

More Telugu News