SA20: ద‌క్షిణాఫ్రికా టీ20 లీగ్‌.. ముచ్చ‌ట‌గా మూడోసారి ఫైన‌ల్‌కు స‌న్‌రైజ‌ర్స్

Sunrisers March Into Third SA20 Final as Royals Run Their Course

  • సెంచూరియన్‌లో పార్ల్ రాయల్స్, సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ మ‌ధ్య ఎలిమినేట‌ర్ మ్యాచ్‌
  • రాయల్స్ పై 8 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించిన‌ స‌న్‌రైజ‌ర్స్
  • అర్ధ శ‌త‌కాల‌తో రాణించిన హెర్మాన్ రూబిన్‌ (81 నాటౌట్‌), ప్రిటోరియస్ (59)
  • రేపు ఎంఐ కేప్ టౌన్‌తో ఫైన‌ల్‌లో త‌ల‌ప‌డ‌నున్న స‌న్‌రైజ‌ర్స్‌

ద‌క్షిణాఫ్రికా టీ20 లీగ్ (ఎస్ఏ20)లో భాగంగా సెంచూరియన్‌లో జరిగిన ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో పార్ల్ రాయల్స్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో ఘ‌న‌ విజయం సాధించి సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ముచ్చ‌ట‌గా మూడోసారి ఫైనల్‌కు చేరుకుంది. రెండుసార్లు డిఫెండింగ్ ఛాంపియన్‌గా నిలిచిన సన్‌రైజర్స్ జట్టు ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండగానే 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. రేపు (శనివారం) జోహన్నెస్‌బర్గ్‌లో ముంబ‌యి ఇండియ‌న్స్‌ కేప్ టౌన్‌తో ఫైన‌ల్‌లో త‌ల‌ప‌డ‌నుంది.

మొద‌ట బ్యాటింగ్ చేసిన రాయ‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 175/4 స్కోర్ చేసింది. ఆ జ‌ట్టు బ్యాట‌ర్ల‌లో హెర్మాన్ రూబిన్‌ (81 నాటౌట్‌), ప్రిటోరియస్ (59) హాఫ్ సెంచ‌రీల‌తో రాణించారు. స‌న్‌రైజ‌ర్స్ బౌల‌ర్ల‌లో క్రెయిగ్ ఓవర్టన్, మార్క్రమ్ త‌లో వికెట్ ప‌డగొట్టారు. దీంతో స‌న్‌రైజ‌ర్స్ ముందు రాయ‌ల్స్ 176 ప‌రుగుల ల‌క్ష్యాన్ని నిర్దేశించింది.

176 ర‌న్స్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన స‌న్‌రైజ‌ర్స్ ఆదిలోనే డేవిడ్ బెడింగ్‌హామ్ వికెట్‌ను కోల్పోయింది. అయితే, ఆ తర్వాత టోనీ డి జోర్జీ, జోర్డాన్ హెర్మాన్ ద్వ‌యం రాయ‌ల్స్ బౌల‌ర్ల‌ను ఆటాడుకున్నారు. మ‌రో వికెట్ ప‌డ‌కుండా ఈ జోడి జాగ్ర‌త్త‌గా ఆడింది. రెండో వికెట్‌కు ఏకంగా 111 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 

డి జోర్జీ 78 పరుగుల వ్య‌క్తిగత స్కోరు వద్ద డునిత్ వెల్లాగే బౌలింగ్‌లో ఔట్ కావ‌డంతో వీరి భాగ‌స్వామ్యానికి తెర‌ప‌డింది. ఆ త‌ర్వాత హెర్మాన్ (81 నాటౌట్) మ‌రింత రెచ్చిపోయాడు. కెప్టెన్ మార్క్రమ్ (11 నాటౌట్)తో కలిసి మూడో వికెట్‌కు అజేయంగా 69 పరుగుల భాగ‌స్వామ్యం అందించ‌డంతో పాటు జట్టును విజ‌య‌తీరాల‌కు చేర్చాడు. 

ఈ విజ‌యంతో స‌న్‌రైజ‌ర్స్ ఫైన‌ల్‌కు దూసుకెళ్లింది. ఇప్ప‌టికే రెండుసార్లు ఎస్ఏ20 టైటిల్ సొంతం చేసుకున్న సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఇప్పుడు వరుసగా మూడో టైటిల్‌ను సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. 

  • Loading...

More Telugu News