Chandrababu: చంద్రబాబు ఎన్డీయే చైర్మన్ కావాలనుకున్నారన్న దేవెగౌడ.. ఖండించిన జేపీ నడ్డా

Deve Gowda says Chandrababu Naidu wanted to be NDA vice chairman

  • 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత చంద్రబాబు ఈ ప్రతిపాదన తెచ్చారన్న దేవెగౌడ
  • బాబు ప్రతిపాదనను మోదీ తిరస్కరించారన్న జేడీఎస్ చీఫ్
  • అసలు అలాంటి చర్చే జరగలేదన్న జేపీ నడ్డా

2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్డీయేకు చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ కానీ కావాలనుకున్నారని, కానీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ అందుకు అంగీకరించలేదని మాజీ ప్రధాని, జేడీఎస్ అధ్యక్షుడు హెచ్‌డీ దేవెగౌడ నిన్న రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. రాష్ట్రప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ మాట్లాడిన దేవెగౌడ ఈ వ్యాఖ్యలు చేశారు. 

‘‘2024లో మోదీకి 240 సీట్లు వచ్చాయి. దీంతో చంద్రబాబునాయుడు తన ఎంపీలతో మోదీకి మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో ఆయన ఎన్డీయే వైస్ చైర్మన్ లేదా, చైర్మన్ కావాలని అనుకున్నారు. అయితే, అందుకు మోదీ అంగీకరించలేదు. ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా పనిచేసిన మోదీకి ప్రభుత్వాన్ని ఎలా నడపాలో తెలుసు. కాబట్టే చంద్రబాబు ప్రతిపాదనను ఆయన తిరస్కరించారు. దేశంలోనే మోదీ గొప్ప నేత’’ అని దేవెగౌడ కొనియాడారు. 

అయితే, దేవెగౌడ వ్యాఖ్యలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు జేపీ నడ్డా ఖండించారు. చంద్రబాబు నాయుడిపై దేవెగౌడ చేసిన వ్యాఖ్యలకు పార్టీ అధ్యక్షుడిగా స్పష్టత ఇవ్వాలనుకుంటున్నానని పేర్కొన్నారు. ‘‘ఎన్డీయేలో ఇలాంటి చర్చ ఎప్పుడూ జరగలేదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో అందరం కలిసి ముందుకు వెళతామని నిర్ణయించుకున్నాం’’ అని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News