dance master amma rajasekhar: విశాఖలో 'అన్న క్యాంటీన్' లో భోజనం చేసిన సినీ ప్రముఖులు

- విశాఖలో అన్న క్యాంటిన్ వద్ద సందడి చేసిన చిత్ర బృందం
- అన్న క్యాంటిన్‌లో భోజనం చేయడాన్ని మర్చిపోలేనన్న అమ్మ రాజశేఖర్
- అన్న క్యాంటిన్‌లో భోజనం చేయడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్న నటుడు రాగిణి రాజ్
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో అన్న క్యాంటిన్‌లను ఏర్పాటు చేసి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందిస్తున్నారు. పేదలకు అన్న క్యాంటిన్ ఎంతగానో ఉపయోగపడుతోంది.
నిత్యం వందలాది మంది పేదలు, వివిధ ప్రాంతాల నుండి నగరాలు, పట్టణాలకు విచ్చేస్తున్న వారు అన్న క్యాంటిన్ల ద్వారా తమ ఆకలిని తీర్చుకుంటున్నారు. ఈ క్రమంలో విశాఖలో గురువారం ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అన్న క్యాంటిన్ వద్ద ఒక చిత్ర బృందం సందడి చేసింది.
డ్యాన్స్ మాస్టర్. దర్శకుడు అమ్మ రాజశేఖర్, జబర్దస్త్ నటుడు ముక్కు అవినాశ్, తల చిత్రం ద్వారా హీరోగా పరిచయం కానున్న రాగిణి రాజ్, చిత్ర బృందం సభ్యులు అన్న క్యాంటిన్ లో భోజనం చేశారు. గురువారం మధ్యాహ్నం వీరు స్థానికులతో కలిసి క్యూలో నిల్చుని భోజనం చేశారు. ఈ సందర్భంగా వీరంతా స్థానికులతో కలిసి కాసేపు సరదాగా గడిపారు.
ఈ సందర్భంలో నటులు తమ అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. అన్న క్యాంటిన్‌లో భోజనం సూపర్ అంటూ కితాబు నిచ్చారు. విశాఖ వాసులతో కలిసి అన్న క్యాంటిన్‌లో భోజనం చేయడం తాను జీవితంలో మర్చిపోలేనని అమ్మ రాజశేఖర్ అన్నారు. అన్న క్యాంటిన్‌లో భోజనం చేయడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని నటుడు రాగిణి రాజ్ పేర్కొన్నారు.