Team India: గెలుపు బోణీ కొట్టిన టీమిండియా

Team India beat England by 4 wickets

  • నాగ్ పూర్ లో టీమిండియా × ఇంగ్లండ్
  • తొలి వన్డేలో  వికెట్ల తేడాతో టీమిండియా గెలుపు
  • రాణించిన గిల్, అయ్యర్, అక్షర్ పటేల్

ఇంగ్లండ్ తో తొలి వన్డేలో టీమిండియా 4 వికెట్లతో విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 249 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ 38.4 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. టీమిండియా ఇన్నింగ్స్ లో శుభ్ మాన్ గిల్ 87, శ్రేయాస్ అయ్యర్ 59, అక్షర్ పటేల్ 52 పరుగులతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో సకిమ్ మహ్మద్ 2, అదిల్ రషీద్ 2, ఆర్చర్ 1, బెతెల్ 1 వికెట్ తీశారు. 

ఈ మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్లు విఫలమైనప్పటికీ... మిడిలార్డర్ అండతో విజయం సాధ్యమైంది. యశస్వి జైస్వాల్ (15), రోహిత్ శర్మ (2), కేఎల్ రాహుల్ (2) విఫలమయ్యారు. 

ఈ విజయంతో 3 మ్యాచ్ ల వన్డే సిరీస్ లో టీమిండియా 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఈ నెల 9న కటక్ లో జరగనుంది.

  • Loading...

More Telugu News