Babar Azam: ఫోన్ పొగొట్టుకున్న పాకిస్థాన్ స్టార్ క్రికెటర్

Pakistan cricketer Babar Azam lost his phone

 


పాకిస్థాన్ స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ బాబర్ అజామ్ కు ఎంత కష్టం వచ్చిపడిందో చూడండి. పాపం, బాబర్ అజామ్ ఫోన్ పొగొట్టుకున్నాడట. ఈ విషయాన్ని తనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. నా ఫోన్ పోయింది... కాంటాక్ట్స్ కూడా పోయాయి. ఫోన్ దొరికిన తర్వాత అందరికీ మళ్లీ అందుబాటులోకి వస్తాను అంటూ బాబర్ ట్వీట్ చేశాడు. 

ఇప్పటి రోజుల్లో ఫోన్ లేనిదే కాలం గడవని పరిస్థితి. అన్నిటికంటే ముఖ్యంగా, ఫోన్ ద్వారా ఆర్థిక లావాదేవీలన్నీ అరచేతిలోనే నిర్వహిస్తున్నారు. అలాంటిది, ఫోన్ పోగొట్టుకోవడం అంటే ఎంతటి ఇబ్బందికర పరిస్థితో అర్థం చేసుకోవచ్చు. 

ఇక, బాబర్ అజామ్ విషయానికొస్తే... ప్రస్తుతం అతడు సొంతగడ్డపై ఈ నెల 8 నుంచి జరగబోయే వన్డే ట్రై సిరీస్ కోసం సన్నద్ధమవుతున్నాడు. పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు ఈ ముక్కోణపు టోర్నీలో పాల్గొంటున్నాయి.

  • Loading...

More Telugu News