Stock Market: స్టాక్ మార్కెట్లకు వరుసగా రెండో రోజు నష్టాలు

markets ends in losses

  • ఆర్బీఐ మానిటరీ పాలసీ నిర్ణయాలు వెలువడనున్న క్రమంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత
  • 213 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 92 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూలతలు ఉన్నప్పటికీ... ఆర్బీఐ మానిటరీ పాలసీ నిర్ణయాలు రేపు వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తతను పాటించారు. ఈ క్రమంలో మన మార్కెట్లు నష్టాలను మూటకట్టుకున్నాయి. 

ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్... 213 పాయింట్ల నష్టంతో 78,058కి పడిపోయింది. నిఫ్టీ 92 పాయింట్లు కోల్పోయి 23,622 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అదానీ పోర్ట్స్ (1.72%), ఇన్ఫోసిస్ (0.94%), యాక్సిస్ బ్యాంక్ (0.71%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (0.60%), టెక్ మహీంద్రా (0.58%).

టాప్ లూజర్స్:
భారతి ఎయిర్ టెల్ (-2.47%), టైటాన్ (-2.28%), ఎన్టీపీసీ (-2.13%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.79%), ఐటీసీ (-1.53%).

  • Loading...

More Telugu News