Chandrababu: ఏపీ మంత్రులకు ర్యాంకులు... చంద్రబాబు, పవన్, లోకేశ్ స్థానాలు ఎంతో తెలుసా?

CM Chandrababu reveals rankings to ministers

  • మంత్రుల పనితీరు ఆధారంగా ర్యాంకులు
  • చంద్రబాబుకు 6వ స్థానం... పదో స్థానంలో పవన్
  • లోకేశ్ కు 8వ ర్యాంకు
  • తొలి స్థానంలో ఫరూఖ్... చివరిస్థానంలో వాసంశెట్టి సుభాష్

పనితీరు ఆధారంగా ఏపీ మంత్రులకు ర్యాంకులు ప్రకటించారు. ఫైళ్ల క్రియరెన్స్ ను ప్రధాన ప్రాతిపదికగా తీసుకుని ర్యాంకుల జాబితా రూపొందించారు. ఇందులో ముఖ్యమంత్రి చంద్రబాబుకు 6వ స్థానం లభించింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 10వ స్థానంలో ఉండగా... విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, హెచ్ఆర్ డీ శాఖల మంత్రి నారా లోకేశ్ 8వ స్థానంలో ఉన్నారు. 

ఈ మినిస్టర్స్ ర్యాంకింగ్స్ లో రాష్ట్ర న్యాయ శాఖ, మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్ తొలి స్థానంలో నిలిచారు. 2వ స్థానంలో కందుల దుర్గేశ్, 3వ స్థానంలో కొండపల్లి శ్రీనివాస్ ఉన్నారు. నాదెండ్ల మనోహర్ 4, డోలా బాలవీరాంజనేయస్వామి 5, సత్యకుమార్ 7, బీసీ జనార్దన్ రెడ్డి 9, సవిత 11, కొల్లు రవీంద్ర 12, గొట్టిపాటి రవికుమార్ 13, నారాయణ, 14 టీజీ భరత్ 15, ఆనం రామనారాయణరెడ్డి 16, అచ్చెన్నాయుడు 17, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి 18, గుమ్మిడి సంధ్యారాణి 19, వంగలపూడి అనిత 20, అనగాని సత్యప్రసాద్ 21, నిమ్మల రామానాయుడు 22, కొలుసు పార్థసారథి 23, పయ్యావుల కేశవ్ 24వ స్థానంలో నిలిచారు. 

ఇక, ఈ జాబితాలో మంత్రి వాసంశెట్టి సుభాష్ చివరిస్థానంలో ఉన్నారు.

  • Loading...

More Telugu News