Vamsi: మళ్లీ ఇంతకాలానికి భానుప్రియ కోసం ఓ కథ రాసుకున్నాను: దర్శకుడు వంశీ

Vamsi Interview

  • భానుప్రియతో నా చివరి సినిమా 'ఆలాపన'
  • ఆమెను చూడక 30 ఏళ్లకు పైనే అవుతోందన్న వంశీ  
  • త్వరలో ఒక సినిమా చేయనున్నానని వెల్లడి  
  • ఆ సినిమా కోసం భానుప్రియతో మాట్లాడే అవకాశం ఉందని వివరణ 


దర్శకుడు వంశీ పరిచయం చేసిన కథానాయికలలో భానుప్రియ ఒకరు. 'సితార' సినిమాతో పరిచయమైన భానుప్రియ, ఆ తరువాత స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయింది. వంశీతో వరుసగా 'అన్వేషణ' .. 'ప్రేమించు పెళ్లాడు' .. 'ఆలాపన' .. వంటి సినిమాలు చేసింది. అలాంటి భానుప్రియ గురించి, తాజాగా 'ఐ డ్రీమ్' వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో వంశీ ప్రస్తావించారు.

"భానుప్రియ కథానాయికగా 'గాలికొండాపురం రైల్వే గేటు' చేయాలనుకున్నాను. కథానాయకుడిగా వెంకటేశ్ ను అనుకున్నాము. కథను రామానాయుడు గారికి వినిపించాము. పాటలను లతా మంగేష్కర్ గారితో పాడించడం కూడా జరిగిపోయింది. కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు సెట్ కాలేదు. 'ఆలాపన' సినిమా తరువాత నేను భానుప్రియగారిని చూడలేదు .. మాట్లాడలేదు" అని అన్నారు. 

"త్వరలో నేను ఒక సినిమా చేయాలనుకుంటున్నాను. ఆ సినిమాలో ఒక అమ్మవారి పాత్ర వుంది. అమ్మవారు ఒక నల్లని రాయిలో అంతర్లీనంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ పాత్రకి భానుప్రియ అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. అమ్మవారి గెటప్పులో ఆమెను అనుకుంటూ కథను రాసుకున్నాను. ఆ సినిమాకి అది చాలా కీలకమైన పాత్ర. నిర్మాతలు కూడా ఆసక్తిని చూపిస్తున్నారు. అది ఎంతవరకూ వర్కౌట్ అవుతుందనేది చూడాలి" అని అన్నారు.

  • Loading...

More Telugu News