Supreme Court: మొదటి భర్తతో విడాకులు తీసుకోకున్నా.. రెండో భర్త నుంచి భరణానికి భార్య అర్హురాలే: సుప్రీంకోర్టు

Wife can get alimony from second husband while she not taking divorce from first husband

  • తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసిన పిటిషనర్
  • ఆమెకు అనుకూలంగా తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు
  • సెక్షన్ 125 క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం భరణానికి ఆమె అర్హురాలేనన్న కోర్టు

మొదటి భర్తతో చట్టబద్ధంగా విడాకులు తీసుకోకున్నా రెండో భర్త నుంచి భరణం కోరే హక్కు భార్యకు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.  మొదటి భర్త నుంచి విడాకులు తీసుకోనందున రెండో భర్త నుంచి భరణం కోరే హక్కు ఆమెకు ఉండదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును పిటిషనర్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. విచారించిన సర్వోన్నత న్యాయస్థానం ఆమెకు అనుకూలంగా తీర్పు చెప్పింది. 

మొదటి భర్త నుంచి విడాకులు తీసుకోకుండా వేరుగా ఉంటూ, రెండో వివాహం చేసుకున్న భర్త నుంచి సెక్షన్ 125 క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం పరిహారాన్ని పొందవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. భరణం అనేది భార్య పొందే ప్రయోజనం కాదని, భర్త నైతికపరమైన, చట్టపరమైన విధి అని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News