Faf du Plessis: 40 ఏళ్ల వ‌య‌సులో క‌ళ్లు చెదిరే క్యాచ్‌.. డుప్లెసిస్ సూప‌ర్ మ్యాన్ ఫీట్ చూస్తే ఔరా అనాల్సిందే!

Faf du Plessis Vintage Flying Catch in SA20

  


ద‌క్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో జోబ‌ర్గ్ సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ క‌ళ్లు చెదిరే క్యాచ్ అందుకుని అంద‌రినీ ఒక్క క్ష‌ణం ఆశ్చ‌ర్యంలో ముంచెత్తాడు. అమాంతం గాల్లోకి ఎగిరి అత‌ను ప‌ట్టిన ఆ క్యాచ్ చూస్తే స్ట‌న్ కావాల్సిందే. డుప్లెసిస్ సూప‌ర్ మ్యాన్ ఫీట్ చూస్తే ఔరా అనాల్సిందే. 

ఇమ్రాన్ తాహిర్ వేసిన బంతిని స‌న్‌రైజ‌ర్స్ ఈస్ట‌ర్న్ కేప్ బ్యాట‌ర్ బేడింగ్‌హామ్ మిడాఫ్ వైపు మంచి షాట్ ఆడాడు. అయితే, దూరంగా వెళుతున్న ఆ బంతిని డుప్లెసిస్ ప‌క్షిలా గాల్లోకి ఎగిరి రెండు చేతుల‌తో ఒడిసి ప‌ట్టుకున్నాడు. అంతే.. అటు బ్యాట‌ర్‌తో పాటు మైదానంలో ఉన్న ప్రేక్ష‌కులంతా షాక్ అయ్యారు. 

40 ఏళ్ల వ‌య‌సులోనూ డుప్లెసిస్ ఇలా అద్భుత‌మైన ఫీల్డింగ్ చేయ‌డం గ‌మ‌నార్హం. ఇక ఐపీఎల్ లో మొన్న‌టి వ‌ర‌కు ఆర్‌సీబీకి ప్రాతినిధ్యం వ‌హించిన అత‌డిని ఇటీవ‌ల జ‌రిగిన మెగా వేలంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ రూ. 2కోట్ల‌కు ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. 

More Telugu News