Ramcharan: RC16 షూటింగ్ స్పాట్‌కు రామ్ చరణ్‌తో కలిసి వచ్చిన స్పెషల్ గెస్ట్!

A special guest on the sets of RC16

  • హైదరాబాద్‌లో ఆర్సీ 16 సినిమా షూటింగ్
  • కూతురు క్లీంకారను తీసుకు వచ్చిన రామ్ చరణ్
  • సెట్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన క్లీంకార

రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న RC16 చిత్రం షూటింగ్ ప్రదేశంలో ఓ ప్రత్యేక అతిథి సందడి చేసింది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ నేడు హైదరాబాద్‌లో జరిగింది.

ఈ సందర్భంగా రామ్ చరణ్ తన కుమార్తె క్లీంకారతో షూటింగ్ ప్రాంతంలో కనిపించారు. లొకేషన్లో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. షూటింగ్ ప్రదేశంలో తన కుమార్తె చేయి చాచి ఏదో చూపిస్తుండగా రామ్ చరణ్ ఆమెను చూస్తూ ఉన్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

  • Loading...

More Telugu News