Chandrababu: తెలంగాణలోనూ చికిత్సకు అనుమతి: ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకంపై చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం

AP government agrees to treatment in Telangana

  • తెలంగాణలో డీఎంఈ గుర్తించిన ఆసుపత్రుల్లో చికిత్సకు అనుమతి
  • ఆసుపత్రులను గుర్తించాలని ఎన్టీఆర్ వైద్య సేవ సీఈవోకు ఆదేశాలు
  • హైదరాబాద్‌లో స్థిరపడిన చాలామంది ఏపీ ఉద్యోగులు 
  • ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య బీమా పథకం అమలుపై కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ డీఎంఈ గుర్తించిన ఆసుపత్రులలో చికిత్స పొందేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రిఫరల్ ఆసుపత్రులను గుర్తించాలని ఎన్టీఆర్ వైద్య సేవ సీఈవోకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణలో వైద్యం చేయించుకున్న పలువురు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు, పెన్షనర్లు తమ తమ బిల్లులు రీయింబర్స్ కాక నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రాష్ట్ర విభజన అనంతరం చాలామంది ఏపీ ఉద్యోగులు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్ సంస్థల ఉద్యోగులు కూడా హైదరాబాద్‌లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక నుండి తెలంగాణ డీఎంఈ గుర్తించిన ఆసుపత్రుల్లో ఏపీ ఉద్యోగులు చికిత్స చేయించుకునేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

  • Loading...

More Telugu News