Pushpa: పుష్ప-2 మూవీ టీం ఎంత పన్ను చెల్లించిందో తెలుసా?

Pushpa 2 movie team paid 110 crore tax

  • సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించిన సీపీఎం నేత
  • నెలవారీ రిటర్న్స్‌ను సమర్పించిన మూవీ నిర్మాతలు
  • రూ.110 కోట్ల పన్ను చెల్లించిన నిర్మాతలు
  • ప్రత్యేకంగా పుష్ప-2కు సంబంధించి చెల్లించారని చెప్పలేమన్న అధికారులు

అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప-2 చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం వసూళ్లకు సంబంధించి ఎంత పన్ను చెల్లించారో తెలుసా? సీపీఎం నేత సి. శోభన్ సమాచార హక్కు చట్టం కింద వాణిజ్య పన్నుల శాఖ ద్వారా పుష్ప-2 పన్ను చెల్లింపు వివరాలను సేకరించారు.

ఈ సినిమాకు సంబంధించి నెలవారీ జీఎస్టీఆర్-3బీ, జీఎస్టీఆర్-01 రిటర్న్స్‌ను కమర్షియల్ ట్యాక్స్ శాఖకు సమర్పించారు. ఇందులో సినిమాకు సంబంధించిన వాటితో పాటు ఇతర రిటర్న్స్ కూడా ఉండవచ్చునని అధికారులు వెల్లడించారు.

ప్రత్యేకంగా పుష్ప-2 సినిమాకు సంబంధించిన రెవెన్యూ బ్రేకప్ చెప్పలేమని, కానీ వారి నుండి నవంబర్, డిసెంబర్ నెలలకు గాను వచ్చిన పన్నులు మాత్రం రూ.110 కోట్ల వరకు ఉన్నట్లు తెలిపారు. ఈ రెండు నెలల టర్నోవర్ రూ.642 కోట్లుగా వెల్లడించారు. ఇందులో సినిమా శాటిలైట్ రైట్స్ అమ్మకం, ఓటీటీ రైట్స్, ఓవర్సీస్ ఆడియో రైట్స్ ద్వారా వచ్చిన ఆదాయం కూడా ఉండవచ్చునని తెలిపారు.

  • Loading...

More Telugu News