Delhi Exit Polls: మోదీకి 'జై' కొట్టిన ఢిల్లీ ఓటర్లు.. బీజేపీదే విజయం అంటున్న మెజార్టీ ఎగ్జిట్ పోల్స్!

- ముగిసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
- బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందంటున్న ఎగ్జిట్ పోల్స్
- బీజేపీకి 51 నుంచి 60 సీట్లు రావచ్చని పీపుల్స్ పల్స్ అంచనా
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎన్నికల ఫలితాలు ఎలా ఉండొచ్చనే అంచనాలను ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. ఎన్నికల్లో ప్రజలు బీజేపీకే పట్టం కట్టబోతున్నారని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని చెపుతున్నాయి. ఏయే సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
పీపుల్స్ పల్స్ - కొడిమో అంచనాలు:
- బీజేపీ : 51 - 60
- ఆప్ : 10 - 19
- కాంగ్రెస్ : 0
చాణక్య స్ట్రాటజీస్:
- బీజేపీ : 39 - 44
- ఆప్ : 25 - 28
- కాంగ్రెస్ : 2 - 3
పీపుల్స్ ఇన్ సైట్:
- బీజేపీ : 40 - 44
- ఆప్ : 25 - 29
- కాంగ్రెస్ : 01
రిపబ్లిక్ పీమార్క్:
- బీజేపీ : 39 - 49
- ఆప్ : 21 - 31
- కాంగ్రెస్ : 01
- బీజేపీ : 39 - 45
- ఆప్ : 29 - 31
- కాంగ్రెస్ : 0 - 1
ఏబీపీ మ్యాట్రిజ్:
- బీజేపీ : 35 - 40
- ఆప్ : 32 - 37
- కాంగ్రెస్ : 0 - 1
- బీజేపీ : 42 - 50
- ఆప్ : 18 - 25
- కాంగ్రెస్ : 0 - 2