Bill Gates: స‌రైన ప్రేయ‌సి దొరికింది.. ఆమెతో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నా: బిల్ గేట్స్

Bill Gates Said Paula Hurd His Serious Girlfriend

  • తొలిసారి త‌న గ‌ర్ల్ ఫ్రెండ్ పౌలా హర్డ్ గురించి చెప్పిన బిల్ గేట్స్ 
  • తనకు ఆమె 'సీరియస్ గర్ల్ ఫ్రెండ్‌' అని పేర్కొన్న బిలియనీర్
  • తామిద్ద‌రం క‌లిసి స‌ర‌దాగా గ‌డుపుతున్నామ‌న్న మైక్రోసాఫ్ట్ ఫౌండ‌ర్ 
  • పౌలా హర్డ్ లాంటి గర్ల్ ఫ్రెండ్ ఉండటం త‌న‌ అదృష్టమ‌ని వ్యాఖ్య‌

బిలియనీర్ బిల్ గేట్స్ తొలిసారి త‌న గ‌ర్ల్ ఫ్రెండ్ పౌలా హర్డ్ గురించి మాట్లాడారు. త‌న‌కు స‌రైన ప్రేయ‌సి దొరికింద‌ని, ఆమెతో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాన‌ని అన్నారు. ఆమెతో తన అనుబంధం గురించి మాట్లాడుతూ పౌలా హర్డ్ ను తన 'సీరియస్ గర్ల్ ఫ్రెండ్' గా అభివర్ణించారు. 

"నాకు పౌలా అనే సీరియస్ గర్ల్ ఫ్రెండ్ ఉండటం నా అదృష్టం. మేము సరదాగా గడుపుతున్నాం. మేమిద్ద‌రం క‌లిసి ఒలింపిక్స్‌కు వెళ్ల‌డం నుంచి ఎన్నో గొప్ప విషయాలు చేస్తున్నాం" అని నిన్న టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మైక్రోసాఫ్ట్ ఫౌండ‌ర్ బిల్‌ గేట్స్ అన్నారు. 

ఇక ఈ జంట 2022 నుంచి వివిధ బహిరంగ కార్యక్రమాలలో కలిసి కనిపిస్తున్నారు. ఒరాకిల్ మాజీ సీఈఓ మార్క్ హ‌ర్డ్ భార్యే పౌలా హర్డ్. 2019లో భ‌ర్త చ‌నిపోయాక గేట్స్ వ‌ద్దకు చేరారు. కాగా, కొన్ని కారణాల వల్ల మిలిండా ఫ్రెంచ్ 2021లో గేట్స్ నుంచి విడాకులు తీసుకున్న విష‌యం తెలిసిందే. 

  • Loading...

More Telugu News