Stock Market: అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ భయాలు.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

markets ends in losses

  • 312 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 42 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 3.38 శాతం పతనమైన ఏషియన్ పెయింట్స్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. అమెరికా-చైనాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధ భయాలు, బ్లూచిప్ కంపెనీల షేర్లలో అమ్మకాల ఒత్తిడి మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 312 పాయింట్లు నష్టపోయి 78,271కి పడిపోయింది. నిఫ్టీ 42 పాయింట్లు కోల్పోయి 23,696 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అదానీ పోర్ట్స్ (1.60%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.20%), టాటా మోటార్స్ (0.91%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.89%), టాటా స్టీల్ (0.75%).

టాప్ లూజర్స్:
ఏషియన్ పెయింట్స్ (-3.38%), టైటాన్ (-3.02%), నెస్లే ఇండియా (-2.23%), హిందుస్థాన్ యూనిలీవర్ (-2.03%), ఎల్ అండ్ టీ (-1.72%).

  • Loading...

More Telugu News