Asif Ali: 6 కోట్ల బడ్జెట్ .. 75 కోట్ల వసూళ్లు: మలయాళ మూవీ రికార్డ్!

Rekha Chitram Movie Update

  • జనవరి 9న విడుదలైన సినిమా
  • ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోనర్లో సాగే కంటెంట్ 
  • ఈ ఏడాది తొలి బ్లాక్ బస్టర్ మూవీగా రికార్డ్  
  • ప్రత్యేక పాత్రలో మెరిసిన మమ్ముట్టి
  • త్వరలో సోనీలివ్ లో స్ట్రీమింగ్
 
 


క్రితం ఏడాది ఆరంభం నుంచే మలయాళ ఇండస్ట్రీ తన విజయ పరంపరను కొనసాగించింది. అలాగే ఈసారి కూడా 'రేఖా చిత్రం' సినిమాతో తొలి హిట్ ను నమోదు చేసింది. అసిఫ్ అలీ .. అనశ్వర రాజన్ ప్రధానమైన పాత్రలను పోషించారు. మలయాళంలో వేణు కున్నప్పిలి నిర్మించిన ఈ సినిమాకి, జోఫిన్ చాకో దర్శకత్వం వహించాడు. మర్డర్ మిస్టరీ తో కూడిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది.

థియేటర్లలోకి దిగిపోయిన దగ్గర నుంచి ఈ సినిమా తన జోరు చూపించింది. విడుదలైన ప్రతి ప్రాంతంలో వసూళ్ల వర్షం కురిపించింది. కేవలం 6 నుంచి 9 కోట్ల లోపు బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా, 13 రోజుల్లోనే 50 కోట్ల మార్క్ ను టచ్ చేసింది. 25 రోజులలో 75 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. సిద్ధిఖీ .. జగదీశ్ .. సాయికుమార్ ముఖ్యమైన పాత్రలలో నటించిన ఈ సినిమాలో, మమ్ముట్టి ప్రత్యేకమైన పాత్రను పోషించడం విశేషం. 

పోలీస్ ఆఫీసర్ వివేక్ గోపీనాథ్ ఒక కేసు విషయంలో సస్పెండ్ అవుతాడు. ఆ తరువాత ఆయన నిజాయితీని గుర్తించి ఒక మర్డర్ మిస్టరీ కేసును అప్పగిస్తారు. ఆ హత్య కేసును పరిశోధిస్తూ వెళ్లిన ఆయనకి, 40 ఏళ్ల క్రితం జరిగిన ఒక హత్యతో ఈ హత్య కేసు ముడిపడి ఉందనే విషయం ఆయనకి అర్థమవుతుంది. అప్పుడు జరిగిన ఆ హత్య ఎవరిది? ఈ కేసును వివేక్ గోపీనాథ్ ఎలా ఛేదిస్తాడు? అనేది కథ. ఈ నెలలోనే ఈ సినిమా 'సోనీ లివ్' లో స్ట్రీమింగ్ కానున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News