Congress MLAs: దానం ఇంట్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల కీలక సమావేశం

Congress MLAs who came from BRS meets in Danam Nagender residence

  • బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు
  • నోటీసులు జారీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం
  • నోటీసులు జారీ చేసిన అసెంబ్లీ కార్యదర్శి

కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంతో, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇంట్లో భేటీ అయ్యారు. వీరిలో కడియం శ్రీహరి, అరికెపూడి గాంధీ, కాలే యాదయ్య, సంజయ్ కుమార్, ప్రకాశ్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్, గూడెం మహిపాల్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెల్లం వెంకట్రావు ఉన్నారు. వీరితోపాటు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా భేటీలో పాల్గొన్నారు. 

ఫిరాయింపుల వ్యవహారంలో ఎలా వ్యవహరించాలనే అంశంపై వీరు ప్రధానంగా చర్చిస్తున్నారు. అందరూ ఢిల్లీకి వెళ్లి అక్కడ సమాలోచనలు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమిపాలయింది. దీంతో, 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లోకి వచ్చారు. ఈ ఫిరాయింపులపై తెలంగాణ హైకోర్టును బీఆర్ఎస్ పార్టీ ఆశ్రయించింది. హైకోర్టులో అనుకూలంగా తీర్పు రాకపోవడంతో సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్ వెళ్లింది. బీఆర్ఎస్ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు... ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే వీరందరికీ నోటీసులు జారీ అయ్యాయి.

  • Loading...

More Telugu News