Marriage: తరగతి గదిలో విద్యార్థితో పెళ్లి ఘటన.. లేడీ ప్రొఫెసర్ కీలక నిర్ణయం!

- బెంగాల్‌లోని మౌలానా అబుల్‌కలాం ఆజాద్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో ఘటన
- పూల దండలు మార్చుకుని, లేడీ ప్రొఫెసర్ నుదుట బొట్టు పెట్టిన విద్యార్థి
- విచారణకు ఆదేశించిన వర్సిటీ యంత్రాంగం
- రాజీనామా లేఖను రిజిస్ట్రార్ కు పంపించిన ప్రొఫెసర్
పశ్చిమ బెంగాల్‌లోని మౌలానా అబుల్‌కలాం ఆజాద్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ తరగతి గదిలో మహిళా ప్రొఫెసర్ ఓ విద్యార్థితో పెళ్లి చేసుకోవడం వైరలైన విషయం తెలిసిందే. ఇద్దరూ పూల దండలు మార్చుకుని, లేడీ ప్రొఫెసర్ నుదుట విద్యార్థి బొట్టు పెట్టాడు. ఈ ఘటన తాలూకు వీడియో నెట్టింట హల్‌చల్ చేయడంతో స్పందించిన వర్సిటీ యంత్రాంగం విచారణకు ఆదేశించింది. అలాగే ఆమెను అధికారులు సెలవుపై పంపారు.
ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ తాజాగా తన రాజీనామా లేఖను రిజిస్ట్రార్ పార్థకు పంపించారు. తాను మానసికంగా ఇబ్బంది పడుతున్నానని, విధుల్లో కొనసాగలేనని ఆమె పేర్కొన్నారు. ఆమె రాజీనామాపై విశ్వవిద్యాలయం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. కాగా, ఆ పెళ్లి తంతు ఓ ప్రాజెక్టులో భాగమని ప్రొఫెసర్ చెబుతున్నారు.