Narendra Modi: ఢిల్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా... మోదీ ట్వీట్!

PM Modi urges Delhi voters to cast their vote

  • ప్రజాస్వామ్య పండుగలో ఓటర్లందరూ పాల్గొనాలని మోదీ పిలుపు
  • తొలిసారి ఓటు వేయనున్న యువతకు అభినందనలు తెలిపిన ప్రధాని
  • ఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట్రపతి ముర్ము, రాహుల్ గాంధీ

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తొలి రెండు గంటల్లో 10 శాతం ఓటింగ్ నమోదయింది. చలి కారణంగా ఓటర్లు నెమ్మదిగా పోలింగ్ బూత్ లకు వస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అతిశీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, కీలక నేతలు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మరోవైపు పోలింగ్ సందర్భంగా ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా కీలక సూచన చేశారు. 'ఢిల్లీలోని అన్ని అసెంబ్లీ స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది. ఈ ప్రజాస్వామ్య పండుగలో ఓటర్లందరూ పాల్గొనాలి. ప్రజాస్వామ్యం ఇచ్చిన అత్యంత విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలి. తొలిసారి ఓటు వేయబోతున్న యువ మిత్రులకు అభినందనలు. గుర్తుంచుకోండి... తొలుత ఓటు వేయండి... ఆ తర్వాత రిఫ్రెష్ అవ్వండి' అని ట్వీట్ చేశారు.

More Telugu News