President Of India: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన రాష్ట్రపతి

President Droupadi Murmu Cast Her Vote In Rashtrapati Bhavan Poling booth

  • ఢిల్లీలో కొనసాగుతున్న పోలింగ్
  • మొత్తం 70 స్థానాలకు ఒకే విడత ఎన్నికలు
  • పోలింగ్ బూత్ లకు క్యూ కట్టిన ప్రముఖులు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ప్రెసిడెంట్ ఎస్టేట్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో ముర్ము ఓటేశారు. అలాగే కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రముఖులు పోలింగ్ బూత్ లకు క్యూ కట్టారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఢిల్లీ అసెంబ్లీలో 70 సీట్లు ఉండగా అన్నింటికీ ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. 

ఇప్పటి వరకు ఓటేసిన ప్రముఖులు..
  • రాష్ట్రపతి ఎస్టేట్‌లో దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము
  • కె.కమ్రాజ్ లేన్ లో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కె. త్రిపాఠీ
  • రాజ్ నివాస్ మార్గ్ లో ఢిల్లీ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా
  • కల్కాజీలో ఢిల్లీ సీఎం అతిశీ 
  • నిర్మాణ్ భవన్ లో లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
  • తుగ్లక్ క్రెసెంట్ లో విదేశాంగ మంత్రి జైశంకర్, ఆయన అర్ధాంగి 
  • ఆనంద్ నికేతన్ లో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి కుటుంబం
  • జన్ పథ్ లో బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్
  • న్యూఢిల్లీ నియోజకవర్గంలో మనీశ్ సిసోడియా దంపతులు

  • Loading...

More Telugu News