Tata Motors: కారు కొనుగోలుకు ఇదే మంచి సమయం.. రూ. లక్ష వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్న టాటా కంపెనీ

- ఎంపిక చేసిన మోడళ్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్న టాటా
- టియాగో, టిగోర్, ఆల్ట్రోజ్, పంచ్ సహా వివిధ మోడళ్లపై రాయితీ
- టియాగోపై రూ. 35 వేల డిస్కౌంట్
కారు కొనుగోలు కోసం చూస్తున్న వారికి ఇదే మంచి సమయం. ఎంపిక చేసిన మోడళ్లపై గరిష్ఠంగా లక్ష రూపాయల వరకు రాయితీ ఇస్తున్నట్టు టాటా మోటార్స్ ప్రకటించింది. వీటిలో టియాగో, టిగోర్, ఆల్ట్రోజ్, పంచ్, నెక్సన్, హారియర్, సఫారీ మోడళ్లు ఉన్నాయి.
టియాగోపై టాటా రూ. 35 వేలు రాయితీ ప్రకటించింది. టిగోర్ మోడల్‌పై రూ. 45 వేలు, ఆల్ట్రోజ్ రేసర్ మినహా మిగతా వేరియంట్లపై రూ. 6 వేలు, పంచ్‌పై రూ. 25 వేలు, నెక్సన్‌పై రూ. 45 వేల రాయితీ ఇస్తున్నట్టు తెలిపింది. అలాగే, ఎస్‌యూవీలైన హారియర్, సఫారీ డీజిల్ వేరియంట్లపై రూ. 75 వేల రాయితీ ఆఫర్ చేస్తోంది. ఆల్ట్రోజ్, నెక్సన్ డీజిల్ వేరియంట్లపై వరుసగా రూ. 65 వేలు, రూ. 45 వేల రాయితీ ఇస్తోంది. ఆల్ట్రోజ్ పెట్రోల్ రేస్ వేరియంట్‌పై గరిష్ఠంగా లక్ష రూపాయల వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్టు టాటా మోటార్స్ ప్రకటించింది.