Sweden: స్వీడన్‌ స్కూల్‌లో కాల్పులు.. 10 మంది మృతి

10 killed in shooting at adult education centre in Sweden

  • ఒరెబ్రోలోని అడల్ట్ ఎడ్యుకేషన్ సెంటర్‌లో ఘటన
  • కాల్పుల అనంతరం తనను తాను కాల్చుకున్న నిందితుడు
  • స్వీడన్ చరిత్రలోనే అతిపెద్ద కాల్పుల ఘటన

స్వీడన్ చరిత్రలోనే అతిపెద్ద కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఒరెబ్రో నగరంలోని ఒక అడల్ట్ ఎడ్యుకేషన్ సెంటర్‌లో జరిగిన కాల్పుల్లో అనుమానితుడు సహా 10 మంది చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత ఉండొచ్చని చెబుతున్నారు. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు, అంబులెన్సులు, అత్యవసర వాహనాలతో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.

ఒక్కడే కాల్పులకు పాల్పడి ఉండొచ్చని, నిందితుడు గతంలో నేరస్థుడు అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్పుల అనంతరం నిందితుడు తనను తాను కాల్చుకున్నాడు. కాల్పులు జరిగిన స్కూల్‌లో వలసదారులు, మానసిక దివ్యాంగులకు పాఠాలు బోధిస్తారు. ఘటన జరిగిన సమయంలో విద్యార్థులు తక్కువ సంఖ్యలో ఉండటంతో ప్రాణనష్టం తక్కువగా ఉన్నట్టు చెబుతున్నారు. స్వీడన్‌కు ఇది ఎంతో బాధాకరమైన రోజని స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ విచారం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News