Delhi Assembly Elections: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం

- ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు
- మొత్తం 70 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్
- ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు బుధవారం నాడు జరగనున్నాయి. అందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ ముగిసే సమయానికి క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటేసే అవకాశం కల్పిస్తారు. రేపు సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ సందడి చేయనున్నాయి.
ఢిల్లీలో 1.56 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 699 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈసారి అధికార ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు హోరాహోరీగా సాగనుంది. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.