Cherlapally Industrial Area: చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ అగ్నిప్రమాదం

- శేషసాయి కెమికల్ పరిశ్రమలో మంటలు
- కొద్దిసేపట్లోనే పక్కనే ఉన్న పరిశ్రమలకు వ్యాపించిన వైనం
- ఘాటైన కెమికల్ పొగలతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి
హైదరాబాదు నగర శివార్లలోని చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తొలుత శేషసాయి కెమికల్ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. కొద్దిసేపట్లోనే ఆ మంటలు ప్కనే ఉన్న మహాలక్ష్మి రబ్బర్ కంపెనీకి విస్తరించాయి. దాంతో ఆ ప్రాంతంమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.
రసాయనాల కారణంగా ఘాటైన పొగ వెలువడింది. స్థానికులు ఆ వాయువులు పీల్చడంతో తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.