Teenmaar Mallanna: తీన్మార్ మల్లన్నపై రెడ్డి సంఘం నేతల ఫిర్యాదు

- వరంగల్ లో బీసీ సభను నిర్వహించిన తీన్మార్ మల్లన్న
- తమ కులంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మల్లన్నపై రెడ్డి సంఘం నేతల ఫైర్
- కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్
కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై తెలంగాణ రెడ్డి సంఘం నేతలు పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. తమ కులాన్ని దూషించారని, వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే... ఆదివారం నాడు వరంగల్ లో తీన్మార్ మల్లన్న బీసీ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రెడ్డి సామాజికవర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రెడ్డి సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెడ్లను కుక్కలతో పోల్చుతూ దూషించారని మండిపడుతున్నారు. తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మల్లన్నపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీని కలిసి కోరారు.