Snacks for Students: తెలంగాణలో 10వ తరగతి విద్యార్థులకు స్నాక్స్ మెనూ ఇదే!

Snacks menu for 10th Class students in Telangana

  • ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్ విద్యార్థులకు స్టడీ అవర్స్
  • సాయంత్రం పూట స్నాక్స్ అందించాలని ప్రభుత్వం నిర్ణయం
  • ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20 వరకు స్నాక్స్

రాష్ట్రంలో 10వ తరగతికి సిద్దమవుతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి తాజాగా మెనూ రూపొందించారు

తృణధాన్యాలతో చేసిన బిస్కెట్లు (మిల్లెట్ బిస్కెట్లు), పల్లీ చిక్కీ, ఉడకబెట్టిన బొబ్బర్లు (పెద్ద శనగలు), ఉల్లిపాయ పకోడీలు, ఉడకబెట్టిన పెసర్లు, శనగలు-ఉల్లిపాయ వంటి  వంటకాలను రోజుకొకటి చొప్పున విద్యార్థులకు అందించాలని అధికారులు నిర్ణయించారు. ఈ స్నాక్స్ కోసం ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.15 చొప్పున ఖర్చు చేయనున్నారు. అందుకోసం, స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీ ఖాతాలకు నిధులు బదిలీ చేయనున్నారు. 

మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు తెలంగాణలో టెన్త్ క్లాస్ పరీక్షలు జరగనుండగా... ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20 వరకు విద్యార్థులకు సాయంత్రం స్టడీ అవర్స్ లో స్నాక్స్ అందించనున్నారు.

  • Loading...

More Telugu News