Stock Market: దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 1,397 పాయింట్లు అప్

- అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు
- 378 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 4.76 శాతం లాభపడ్డ ఎల్ అండ్ టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో మన సూచీలు రాణించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,397 పాయింట్లు పెరిగి 78,583కి చేరుకుంది. నిఫ్టీ 378 పాయింట్లు లాభపడి 23,739 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎల్ అండ్ టీ (4.76%), అదానీ పోర్ట్స్ (3.83%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.50%), టాటా మోటార్స్ (3.38%), రిలయన్స్ (3.28%).
టాప్ లూజర్స్:
ఐటీసీ హోటల్స్ (-4.16%), జొమాటో (-1.57%), నెస్లే ఇండియా (-0.81%), మారుతి (-0.23%), టెక్ మహీంద్రా (-0.11%).