Kerala: బిర్యాని, చికెన్ ఫ్రై కావాలంటూ చిన్నారి వీడియో... కేరళ మంత్రి స్పందన ఇదే

Kerala Boy Wants Anganwadi To Serve Biryani

  • అంగన్వాడీలో ఉప్మాకు బదులు బిర్యాని కావాలన్న చిన్నారి
  • వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసిన తల్లి
  • వీడియోను చూసిన మంత్రి... సమీక్షిస్తామంటూ హామీ

కేరళలో ఓ చిన్నారి చేసిన విజ్ఞప్తికి ఆ రాష్ట్ర మంత్రి స్పందించారు. అంగన్వాడీలో బిర్యానీ, చికెన్ ఫ్రై వడ్డించాలని కోరుతూ శంకు అనే చిన్నారి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ వీడియోపై రాష్ట్ర ఆరోగ్య, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి వీణా జార్జ్ స్పందించారు.

కేరళకు చెందిన చిన్నారి శంకుకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. అతడు అంగన్వాడీ పాఠశాలకు వెళుతున్నాడు. అక్కడ అతనికి ఉప్మా పెడతారు. అంగన్వాడీలో తనకు బిర్యానీ, చికెన్ ఫ్రై ఇస్తే బాగుంటుందని ఆ చిన్నారి తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను అతని తల్లి సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసింది.

ఈ పోస్ట్ మంత్రి వీణా జార్జ్ దృష్టికి చేరింది. వెంటనే స్పందించిన మంత్రి, అంగన్వాడీ మెనూను సమీక్షిస్తామని తెలిపారు. బిర్యానీని మెనూలో చేర్చేందుకు ప్రయత్నిస్తామని ఆమె హామీ ఇచ్చారు. మెనూను సమీక్షించే ఆలోచనకు కారకుడైన చిన్నారి శంకుకు, అతని తల్లికి, అంగన్వాడీ సిబ్బందికి మంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. శంకు చేసిన సూచనను పరిగణనలోకి తీసుకుని మెనూను తప్పకుండా సమీక్షిస్తామని ఆమె స్పష్టం చేశారు.

More Telugu News