Viral Videos: బాయ్ ఫ్రెండ్ కోసం ఇద్దరు స్కూల్ విద్యార్థినుల బాహాబాహీ... వైరల్ వీడియో!

- బీహర్ రాష్ట్రం పూర్నియా జిల్లాలో ఘటన
- ఒకే అబ్బాయిని ఇష్టపడ్డ ఇద్దరు విద్యార్థినులు
- తర్వాత ఆ విషయం తెలుసుకుని రోడ్డుపై కొట్టుకున్న వైనం
- ఈ ఘటన తాలూకు వీడియో నెట్టింట ప్రత్యక్షం కావడంతో వైరల్
ఒకే అబ్బాయిని ప్రేమించిన ఇద్దరు స్కూల్ విద్యార్థినులు బాయ్ ఫ్రెండ్ కోసం బాహాబాహీకి దిగిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. స్కూల్ యూనిఫాంలో ఉన్న వారిద్దరూ రోడ్డుపై జుట్టుపట్టుకుని మరీ కొట్టుకోవడం వీడియోలో ఉంది. బీహర్ రాష్ట్రం పూర్నియా జిల్లాలోని గులాబ్‌బాగ్ హన్స్‌దా రోడ్ సమీపంలో ఉండే ఓ ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది.
తాము ఒకే అబ్బాయిని ఇష్టపడుతున్నామని తెలుసుకున్న ఆ ఇద్దరు విద్యార్థినులు ముందుగా వాగ్వాదానికి దిగారు. అలా వాగ్వాదంతో బయటకు వచ్చే క్రమంలో ఇద్దరూ ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. బయటకు వచ్చిన తర్వాత వారికి వాళ్ల స్నేహితులు తోడయ్యారు.
దాంతో గొడవ కాస్త ముదిరి రెండు వర్గాలుగా చీలిపోయిన విద్యార్థినులు రోడ్డుపై ఘోరంగా కొట్టుకున్నారు. దాన్ని అటువైపుగా వెళుతున్న వారు వీడియో తీసి, నెట్టింట పెట్టడంతో అది కాస్తా వైరల్ గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు "బుద్ధిగా చదువుకోవాల్సిన సమయంలో ఇలాంటి దిక్కుమాలిన పనులేంటి?" అని కామెంట్స్ చేస్తున్నారు.