Talasani: ప్రాధాన్యత గల అంశాలపై చర్చ ఒక్క రోజులోనే ముగించడం ఏమిటి?: తలసాని

- ప్రభుత్వం చేసిన కులగణన తప్పు అంటున్నామన్న తలసాని
- అది ఎలా కరెక్ట్ అవుతుందో ప్రభుత్వం నిరూపించాలని డిమాండ్
- సర్వేపై తమకు అనుమానాలున్నాయని వ్యాఖ్య
మంత్రి శ్రీధర్ బాబు అడగ్గానే స్పీకర్ గడ్డం ప్రసాద్ శాసనసభను వాయిదా వేయడం దారుణమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అత్యంత ప్రాధాన్యత గల అంశంపై నాలుగు రోజులు చర్చించకుండానే ఒక్క రోజులోనే ముగించడం ఏమిటని ప్రశ్నించారు. అన్యాయంగా, కుట్రపూరితంగా వ్యవహరించడాన్ని తాము సహించబోమని చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వం చేసిన కులగణన తప్పు అని తాము అంటున్నామని... అది ఎలా కరెక్ట్ అవుతుందో నిరూపించుకోవాలని అన్నారు. సర్వేపై తమకు అనుమానాలు ఉన్నాయని... అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు అన్యాయం జరిగితే... బీసీల ఐక్యతతో అతిపెద్ద ఉద్యమం వస్తుందని హెచ్చరించారు.