Tirupati Deputy Mayor: తిరుపతి డిప్యూటీ మేయర్ పదవి టీడీపీ కైవసం

TDP wins Tirupati Deputy Mayor

  • తిరుపతి డిప్యూటీ స్పీకర్ గా మునికృష్ణ
  • 26 ఓట్లతో మ్యాజిక్ ఫిగర్ అందుకున్న మునికృష్ణ
  • వైసీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డికి 21 ఓట్లు

తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. డిప్యూటీ మేయర్ గా అభ్యర్థి మునికృష్ణ ఎన్నికయ్యారు. మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 50 మంది కార్పొరేటర్లకు గాను ప్రస్తుతం 47 మంది ఉన్నారు. తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి, జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నారు. మొత్తం 50 మంది సభ్యులకు గాను మునికృష్ణకు 26 మంది ఓటు వేశారు. వైసీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డికి 21 మంది మద్దతుగా నిలిచారు. దీంతో మునికృష్ణ గెలిచినట్టు అధికారులు ప్రకటించారు.

  • Loading...

More Telugu News