BRS MLAs: కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు

- కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు
- వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసిన అసెంబ్లీ కార్యదర్శి
- వివరణ ఇచ్చేందుకు సమయం కావాలని కోరిన ఎమ్మెల్యేలు
కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు నోటీసులు జారీ చేశారు. లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అందాయి. అయితే, వివరణ ఇచ్చేందుకు తమకు సమయం కావాలని ఎమ్మెల్యేలు కోరారు.
మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిలో కడియం శ్రీహరి, దానం నాగేందర్, కాలే యాదయ్య, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరికెపూడి గాంధీ, సంజయ్ కుమార్ ఉన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. అయితే స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో హైకోర్టు, సుప్రీంకోర్టును బీఆర్ఎస్ నేతలు ఆశ్రయించారు.