Jagtial District: జగిత్యాల రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్సై దుర్మరణం!

- రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్సై కొక్కుల శ్వేత మృతి
- ఎదురుగా వచ్చిన బైక్‌ను తప్పించబోయి ఓ చెట్టును ఢీకొట్టిన ఎస్సై కారు
- గొల్లపల్లి నుంచి జగిత్యాల వైపు వెళుతున్న సమయంలో ప్రమాదం
- ప్రస్తుతం జగిత్యాల పోలీసు హెడ్ క్వార్టర్స్ లో పనిచేస్తున్న శ్వేత
జగిత్యాలలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిల్వకోడూరు వద్ద ఎదురుగా వచ్చిన ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి కారు ఓ చెట్టును ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న మహిళా ఎస్సై కొక్కుల శ్వేత చనిపోయారు. గొల్లపల్లి నుంచి జగిత్యాల వైపు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో బైక్‌పై వెళుతున్న వ్యక్తి కూడా మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. దాంతో ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం కోసం జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా, శ్వేత ప్రస్తుతం జగిత్యాల పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో పనిచేస్తున్నారు.