Subrahmanyam: నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు: వైసీపీ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం

- ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యంను కిడ్నాప్ చేశారంటూ వైసీపీ నేతల ఆరోపణ
- అనారోగ్యం కారణంగా తాను ఆసుపత్రిలో ఉన్నానన్న సుబ్రహ్మణ్యం
- వదంతులు సృష్టించవద్దని విన్నపం
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికలు కాసేపట్లో జరగనున్నాయి. మరోవైపు, నిన్న రాత్రి నుంచి వైసీపీ ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం కనిపించడం లేదని, ఆయనను కిడ్నాప్ చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఫోన్ లో కూడా ఆయన అందుబాటులో లేరని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం స్పందించారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని చెప్పారు. అనారోగ్యం కారణంగా తాను ఆసుపత్రిలో చేరానని, తనను కిడ్నాప్ చేశారంటూ వదంతులను సృష్టించవద్దని కోరారు.